ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. చింతల ఈశ్వరయ్య, శాంతి దంపతులు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు దాతలు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.

మనుబోలులో విఘ్నేశ్వరుని మండపం వద్ద భక్తులకు భారీ అన్నదానం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. చింతల ఈశ్వరయ్య, శాంతి దంపతులు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు దాతలు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.

