నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ స్టేట్ డైరెక్టర్, మాజీ న్యాయమూర్తి ఎం.ఏ. సలీం గారు మరియు తెలంగాణ యాక్టివ్ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్ గారు కామారెడ్డి జిల్లా DTO టీ. సంతోష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎం.ఏ. సలీం ఆర్టీఐ చట్టం అమలుతీరు, ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అందుతున్న విధానం గురించి DTOను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన DTO సంతోష్ కుమార్, ఆర్టీఐకి సంబంధించిన సమాచారాన్ని ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయంలో అడిగిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.
అలాగే సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను DTO సంతోష్ కుమార్ అభినందించారు. ప్రజలకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ అధ్యక్షులు సీ.హెచ్. వినోద్ కుమార్తో పాటు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కామారెడ్డి DTO సంతోష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఐ పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీం
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ స్టేట్ డైరెక్టర్, మాజీ న్యాయమూర్తి ఎం.ఏ. సలీం గారు మరియు తెలంగాణ యాక్టివ్ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్ గారు కామారెడ్డి జిల్లా DTO టీ. సంతోష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎం.ఏ. సలీం ఆర్టీఐ చట్టం అమలుతీరు, ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అందుతున్న విధానం గురించి DTOను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన DTO సంతోష్ కుమార్, ఆర్టీఐకి సంబంధించిన సమాచారాన్ని ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయంలో అడిగిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. అలాగే సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను DTO సంతోష్ కుమార్ అభినందించారు. ప్రజలకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ అధ్యక్షులు సీ.హెచ్. వినోద్ కుమార్తో పాటు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

