పోలీసులపై తిరగబడిన స్మగ్లర్ జాకీర్‌పై కాల్పులు
కాలికి గాయం.. ఆసుపత్రికి తరలింపు
దువ్వూరు: కడప జిల్లాలోని దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసులపై తిరగబడిన ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ కాల్పుల్లో జాకీర్ కాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడిన జాకీర్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం కడప జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


