రైతన్నలకు బ్రహ్మన్న అభయహస్తం
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23
నల్లజర్ల, నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెం గ్రామంలో నిన్న రాత్రి గాలి వాన బీభాత్సమ్ సృష్టించింది బలమైన గాలులు వీచగా పొలంలో వున్న మామిడి చెట్లు జీడిమామిడి చెట్లు వెర్లతో పాటు నెలకొరిగాయి పంటలు కొన్ని దెబ్బతిన్నాయి అలాగే రోడ్డు మీద వున్న షాపులు పై రేకులు కూడా గాలికి కొట్టుకుపోయాయి. నష్టపోయిన రైతులను బుధవారం ఏ ఎం సీ చైర్మన్ యద్దన పూడి బ్రహ్మరాజు స్వయంగా కలసి రైతుతులను వారిపరిస్థితి పంటల నష్టం అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులను అన్ని విధాలుగా ఆడుకుంటామని అభయమిచ్చారు జరిగిన పరిణామల్ని ఎం ఎల్ ఏ దృష్టికి తీసుకు వెళ్ళతానని నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు. అన్ని విధాలుగా తోడుగా ఉంటామని బ్రహ్మ తెలిపారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


