Wednesday, 23 September 2026
  • Home  
  • MRPS మండల ఉపాధ్యక్షుడిగా మాగి వెంకన్న
- ఖమ్మం

MRPS మండల ఉపాధ్యక్షుడిగా మాగి వెంకన్న

హస్నాబాద్‌కు చెందిన వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక.. 1995 నుంచి మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర తిరుమలాయపాలెం, పున్నమి: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) తిరుమలాయపాలెం మండల ఉపాధ్యక్షుడిగా హస్నాబాద్ గ్రామానికి చెందిన మాగి వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా స్థాయి నాయకుల సమక్షంలో ఆయనను ఈ బాధ్యతకు ఎంపిక చేశారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు, ప్రజా సమస్యలపై పోరాటాల్లో పాల్గొన్న వెంకన్న.. 1995 నుంచి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహించిన పలు ఉద్యమాలు, పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. కురుక్షేత్ర మహాసభ, ధర్మయుద్ధం, సైకిల్ యాత్ర తదితర కార్యక్రమాల్లో భాగస్వామ్యమై వాటి విజయవంతానికి కృషి చేశారు. మండల స్థాయిలో తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ జాతి అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

హస్నాబాద్‌కు చెందిన వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక.. 1995 నుంచి మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర

తిరుమలాయపాలెం, పున్నమి:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) తిరుమలాయపాలెం మండల ఉపాధ్యక్షుడిగా హస్నాబాద్ గ్రామానికి చెందిన మాగి వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా స్థాయి నాయకుల సమక్షంలో ఆయనను ఈ బాధ్యతకు ఎంపిక చేశారు.

చిన్ననాటి నుంచే విద్యార్థులు, ప్రజా సమస్యలపై పోరాటాల్లో పాల్గొన్న వెంకన్న.. 1995 నుంచి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహించిన పలు ఉద్యమాలు, పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. కురుక్షేత్ర మహాసభ, ధర్మయుద్ధం, సైకిల్ యాత్ర తదితర కార్యక్రమాల్లో భాగస్వామ్యమై వాటి విజయవంతానికి కృషి చేశారు.

మండల స్థాయిలో తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ జాతి అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.