Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఓటు పై అవగాహన – అందమైన పాలన (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటు పై అవగాహన – అందమైన పాలన (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • నిర్ణీత వయస్సుగల ప్రజలందరికి ఉన్న హక్కు ఓటు ఉత్తమ నాయకుని ఎంపికతో పాటు ఉత్తమ ప్రభుత్వ పరిపాలనకు రూటు … ఓటు ఓటేయ్యడానికి నోటుకు ఆశ పడితే పొరపాటు మందు కోసం ముందుకెలితే మతిపోటు నాయకుని ఎంపికకు కాకూడదు రేటు అనర్హులను గెలిపిస్తే బ్రతుకంతా చీకటి కాటు…
  • ఆలోచించు మిత్రమా..
  • ఓటరుగా నీ పయనం ఎటు?… ఓటుపై అవగాహన సంక్షేమ సమాజాన ఆదరణ నాయకత్యంపై జనసమోహ పరిశోధన అర్హునికి ఓటు వేయడమే మన కర్తవ్య నిర్వహణ వర్తమాన భవిష్యత్ తరానికి తరగని అభినందన ఓటరుగా పేరు నమోదు చేసుకుందాం మంచి నాయకులను నాయకత్వాన్ని కోరుకుందాం ఓటు హక్కును సద్వినియోగం…

నిర్ణీత వయస్సుగల ప్రజలందరికి ఉన్న హక్కు ఓటు
ఉత్తమ నాయకుని ఎంపికతో పాటు
ఉత్తమ ప్రభుత్వ పరిపాలనకు రూటు … ఓటు

ఓటేయ్యడానికి నోటుకు ఆశ పడితే పొరపాటు
మందు కోసం ముందుకెలితే మతిపోటు
నాయకుని ఎంపికకు కాకూడదు రేటు
అనర్హులను గెలిపిస్తే బ్రతుకంతా చీకటి కాటు
ఓటు నైతిక విలువల రూటైతే పాలన ఎంతో స్వీటు.

ఆలోచించు మిత్రమా..
ఓటరుగా నీ పయనం ఎటు?…

ఓటుపై అవగాహన
సంక్షేమ సమాజాన ఆదరణ
నాయకత్యంపై జనసమోహ పరిశోధన
అర్హునికి ఓటు వేయడమే మన కర్తవ్య నిర్వహణ
వర్తమాన భవిష్యత్ తరానికి తరగని అభినందన

ఓటరుగా పేరు నమోదు చేసుకుందాం
మంచి నాయకులను నాయకత్వాన్ని కోరుకుందాం
ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందాం
మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుందాం

ఓటు విలువ అమూల్యం
అందమైన పాలనకు వజ్రతుల్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *