వార్త ముఖ్యాంశాలు
- రేపు ఆత్మకూరులో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆత్మకూరు: ఆత్మకూరు పురపాలక సంఘానికి 2026లో నిర్వహించిన సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఛైర్‌పర్సన్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఈ కార్యక్రమం సోమవారం (నవంబర్ 23) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగనుంది.
- తొలుత ఎన్నికైన ఛైర్‌పర్సన్‌తో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేపు ఆత్మకూరులో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆత్మకూరు: ఆత్మకూరు పురపాలక సంఘానికి 2026లో నిర్వహించిన సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఛైర్‌పర్సన్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సోమవారం (నవంబర్ 23) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగనుంది. తొలుత ఎన్నికైన ఛైర్‌పర్సన్‌తో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ ఎంపిక కోసం ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు కార్యక్రమ వివరాలను మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ వెల్లడించారు.నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పురపాలక సంఘంలో పాలనాపరమైన కార్యకలాపాలు నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.