14, 15వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం.. వార్డు అభ్యర్థులతో కలిసి ఓటర్లను కలిసిన సర్పంచ్ అభ్యర్థి
బోగోలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుందుర్తి వెంకట వరప్రసాదరావు 14, 15వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. వార్డు సభ్యుల అభ్యర్థులు తుపాకుల లావణ్య (14వ వార్డు), తూముల రియాజ్ కుమార్ (15వ వార్డు) లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కుందుర్తి వెంకట వరప్రసాదరావు ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో గ్రామ సమగ్ర అభివృద్ధికి చేపట్టనున్న కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యంపై తమ కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
సర్పంచ్ అభ్యర్థి కుందుర్తి వెంకట వరప్రసాదరావు నాయకత్వంలో వార్డు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో నాగులవరం సొసైటీ అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు, బోగోలు-2 ఎంపీటీసీ పులి వెంకటస్వామి, మునగాల అన్నారెడ్డితో పాటు పలువురు కూటమి నాయకులు, స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్