అనపర్తి, సెప్టెంబరు 23 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అనపర్తి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం పదవీకాలం పూర్తవుతున్న అనపర్తి మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) అంసూరి సూర్యనారాయణతో పాటు మండల ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, కాకినాడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







