Wednesday, 23 September 2026
  • Home  
  • చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన
- కడప

చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 23): వేముల: చాగలేరు గ్రామ సచివాలయాన్ని బుధవారం అధికారులు తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ రథం, బిన్ బ్యాగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వేముల, చాగలేరు గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్ల ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని వివరించారు. తడి చెత్తను బిన్‌లో, పొడి చెత్తను ప్రత్యేక బ్యాగ్‌లో వేసి అందించాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందిస్తే, అందుకు బదులుగా అవసరమైన నిత్యావసర వస్తువులను పొందవచ్చని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని కాచి చల్లార్చి తాగాలని ప్రజలకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించడం ద్వారా స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
(సెప్టెంబర్ 23):
వేముల: చాగలేరు గ్రామ సచివాలయాన్ని బుధవారం అధికారులు తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ రథం, బిన్ బ్యాగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

వేముల, చాగలేరు గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్ల ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని వివరించారు. తడి చెత్తను బిన్‌లో, పొడి చెత్తను ప్రత్యేక బ్యాగ్‌లో వేసి అందించాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందిస్తే, అందుకు బదులుగా అవసరమైన నిత్యావసర వస్తువులను పొందవచ్చని తెలిపారు.

వర్షాకాలం నేపథ్యంలో గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని కాచి చల్లార్చి తాగాలని ప్రజలకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించడం ద్వారా స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.