పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం శోభయాత్రను ప్రశాంతంగా సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు



