నులిపురుగుల నివారణపై అవగాహన అవసరం యం ఈ ఓ భాగవతి దేవి.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21
నల్లజెర్ల: నులిపురుగుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నల్లజెర్ల మండల విద్యాశాఖాధికారి (MEO) భాగవతి దేవి అన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, బలహీనత, ఆకలి తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
నులిపురుగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో MPDO విజయకుమార్, PHC వైద్యులు డా. సిరాఉద్దీన్ పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం సూచించిన విధంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించాలని, విద్యార్థులు పరిశుభ్రతా అలవాట్లు పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


