Monday, 29 June 2026
  • Home  
  • వరంగల్‌కు తరలివెళ్లిన ఖమ్మం బీజేపీ శ్రేణులు
- ఖమ్మం

వరంగల్‌కు తరలివెళ్లిన ఖమ్మం బీజేపీ శ్రేణులు

ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఖమ్మం జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఖమ్మం నుంచి వరంగల్‌కు బయలుదేరిన ప్రత్యేక బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భము గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వరంగల్ సభలో పాల్గొనేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, నంబూరు రామలింగేశ్వరరావు, గుత్త వెంకటేశ్వర్లు, ధనియాకుల వెంకట్ నారాయణ, అల్లిక అంజయ్య, రుద్రగాని మాధవ, పిల్లలమర్రి వెంకట్ రాజేష్ గుప్తా, పిట్టల వెంకట నరసయ్య, నాగేశ్వరరావు, గడీల నరేష్, వంకదాని రామకృష్ణతో పాటు జిల్లా, మండల, నగర స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఖమ్మం జిల్లా నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా వరంగల్‌కు బయలుదేరారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఖమ్మం జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఖమ్మం నుంచి వరంగల్‌కు బయలుదేరిన ప్రత్యేక బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భము గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

వరంగల్ సభలో పాల్గొనేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, నంబూరు రామలింగేశ్వరరావు, గుత్త వెంకటేశ్వర్లు, ధనియాకుల వెంకట్ నారాయణ, అల్లిక అంజయ్య, రుద్రగాని మాధవ, పిల్లలమర్రి వెంకట్ రాజేష్ గుప్తా, పిట్టల వెంకట నరసయ్య, నాగేశ్వరరావు, గడీల నరేష్, వంకదాని రామకృష్ణతో పాటు జిల్లా, మండల, నగర స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడి సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఖమ్మం జిల్లా నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా వరంగల్‌కు బయలుదేరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.