భూపాలపల్లి:- ఈనెల 18,19 న SGF మండల స్థాయి ఆధ్వర్యంలో భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు బాలికల అండర్ 14 కబడ్డీ విభాగంలో ఏం.శ్రీనిహా, ఖో- ఖో విభాగంలో జి.సాత్విక , అండర్ 17 కబడ్డీ విభాగంలో జి.సాయి మనస్విని,
ఖో – ఖో విభాగంలో షేక్ సన అలాగే బాలుర విభాగంలో అండర్ 14 కబడ్డీ విభాగంలో ఏ. సుశాంత్, ఏ. అశ్వత్, వాలీబాల్ విభాగంలో జి. విష్ణు అండర్ 17 ఖో – ఖో విభాగంలో పి. సాయి చరణ్ ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ రజనీకాంత్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన గౌరవ తల్లిదండ్రులకు మరియు వారికి క్రీడల్లో మెలకువలు నేర్పించిన వ్యాయామ ఉపాధ్యాయులు సాంబరాజు మరియు శ్రీధర్ లకు స్థానిక ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడల పట్ల మరియు విద్య పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచుతూ ముందుకు కొనసాగుతామని అలాగే మండల స్థాయిలో కూడా విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

SGF భూపాలపల్లి మండల స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు*
భూపాలపల్లి:- ఈనెల 18,19 న SGF మండల స్థాయి ఆధ్వర్యంలో భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు బాలికల అండర్ 14 కబడ్డీ విభాగంలో ఏం.శ్రీనిహా, ఖో- ఖో విభాగంలో జి.సాత్విక , అండర్ 17 కబడ్డీ విభాగంలో జి.సాయి మనస్విని, ఖో – ఖో విభాగంలో షేక్ సన అలాగే బాలుర విభాగంలో అండర్ 14 కబడ్డీ విభాగంలో ఏ. సుశాంత్, ఏ. అశ్వత్, వాలీబాల్ విభాగంలో జి. విష్ణు అండర్ 17 ఖో – ఖో విభాగంలో పి. సాయి చరణ్ ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ రజనీకాంత్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన గౌరవ తల్లిదండ్రులకు మరియు వారికి క్రీడల్లో మెలకువలు నేర్పించిన వ్యాయామ ఉపాధ్యాయులు సాంబరాజు మరియు శ్రీధర్ లకు స్థానిక ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడల పట్ల మరియు విద్య పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచుతూ ముందుకు కొనసాగుతామని అలాగే మండల స్థాయిలో కూడా విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

