జ్ఞాపకాలు పదిలపరుచుకుందాం
(మన ఉనికి ఆనవాలివేగదా)
@@@@@@@@@@@@
సగటు మనిషిని
అచేతనున్ని చేసేవి
మనీనా!
మనుషులా!?
నేనైతే ముమ్మాటికీ మనీయేఅంటాను
ప్రతీ విషయాన్ని మనీతో ముడిపెట్టిన
మాయ మార్కెటైజ్డ్ వరల్డ్ లో గింగిర్లు కొడుతూ
ప్రతీదీ డబ్బుమయమే
అనే మిషతో ఊరేగుతున్నారు
ఇప్పుడంతా సమాజంలో మనం ప్రేమానురాగాలు మృగ్యమైన మరబొమ్మలుగా మారిపోతున్నాము
కాలం కన్న కాసు విలువైనదేమి కాదు
కానీ
తాత్కాలిక ఉపశమనం కాసే,
కానీ
అదిప్పుడు కాలాన్ని శాసించే స్థాయికి చేరుకుంది .
ఇదో మనీ వేదాంతం
శుష్కప్రియత్వం
దయా, జాలి ,కరుణ ఆత్మీయతానురాగాలు
ఏ సమాజంలో శూన్యమైపోతాయో!
ఆ సమాజం మానవ సమాజం కాక
ఆటవిక, న్యాయరహిత
సమాజాన్ని ఏర్పాటు చేసుకొని ఊరేగుతుంది
కనీసం మనం మన జీవితంలో ఒక్కరోజైనా పరుల కోసం బ్రతుకుదాం
దయ జాలి కరుణ యొక్క ఉదాత్తమైన గుణాలను చాటుదాం
రేపు మనం పోయినా మన జ్ఞాపకాలను ఈ భూతలాన కొన్ని వదిలి వెళ్ళాలి కదా!
అంకాల సోమయ్య
దేవరుప్పుల
జనగామ

