Tuesday, 22 September 2026
  • Home  
  • 70 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనగామ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగింపు
- జనగాం

70 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనగామ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగింపు

70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనగామ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగింపు ———————————————————————- జనగామ, సెప్టెంబర్ 19,పున్నమి జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జనగామ జిల్లా మినీ స్టేడియం, ధర్మకంచలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) జనగామ జిల్లా స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌ను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడల్లో అండర్–14, అండర్–17 బాలబాలికలకు పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ముగింపు కార్యక్రమంలో ఇన్‌చార్జి AD గౌసియా బేగం బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు మరియు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి సుమారు 2,400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారులకు భోజనం, తాగునీరు తదితర అవసరమైన వసతులను నిర్వాహకులు కల్పించారు. జిల్లా స్థాయి సెలక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో జరిగే తదుపరి పోటీల్లో జనగామ జిల్లా తరఫున పాల్గొంటారని SGF జనగామ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జాటోత్ గోర్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అజ్మీర కిషన్, గంగిశెట్టి మనోజ్ కుమార్, కిరణ్ కుమార్,కొండా రవి హనుమంతరావు, కె. శ్రీనివాస్, సైదులు రవికుమార్ శ్రీదేవి సుధారాణి దేవ్ సింగ్ రవికుమార్ సాయికుమార్ పాండ్యా వివిధ మండలాల SGF కార్యదర్శులు, PDs/PETs, క్రీడా ఉపాధ్యాయులు మరియు ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ SGF జనగామ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనగామ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగింపు
———————————————————————-
జనగామ, సెప్టెంబర్ 19,పున్నమి జిల్లా ప్రతినిధి :
జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జనగామ జిల్లా మినీ స్టేడియం, ధర్మకంచలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) జనగామ జిల్లా స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌ను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.
కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడల్లో అండర్–14, అండర్–17 బాలబాలికలకు పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ముగింపు కార్యక్రమంలో ఇన్‌చార్జి AD గౌసియా బేగం బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు మరియు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.
జిల్లాలోని వివిధ మండలాల నుండి సుమారు 2,400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారులకు భోజనం, తాగునీరు తదితర అవసరమైన వసతులను నిర్వాహకులు కల్పించారు.
జిల్లా స్థాయి సెలక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో జరిగే తదుపరి పోటీల్లో జనగామ జిల్లా తరఫున పాల్గొంటారని SGF జనగామ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జాటోత్ గోర్ సింగ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అజ్మీర కిషన్, గంగిశెట్టి మనోజ్ కుమార్, కిరణ్ కుమార్,కొండా రవి హనుమంతరావు, కె. శ్రీనివాస్, సైదులు రవికుమార్ శ్రీదేవి సుధారాణి దేవ్ సింగ్ రవికుమార్ సాయికుమార్ పాండ్యా వివిధ మండలాల SGF కార్యదర్శులు, PDs/PETs, క్రీడా ఉపాధ్యాయులు మరియు ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు.
పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ SGF జనగామ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.