కడప జిల్లా రాజంపేట మండలం డీబీఎన్ పల్లి గ్రామంలో వినాయక లడ్డూకు రూ.1.20 లక్షల ధర
కడప జిల్లా రాజంపేట మండలం డీబీఎన్ పల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. ఈ వేలం పాటలో నాగినేని వరుణ్ సాయి (సన్నీ) రూ.1,20,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు.వేలం పాటలో భక్తులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లడ్డూను కైవసం చేసుకున్న నాగినేని వరుణ్ సాయి మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.అనంతరం నాగినేని వరుణ్ సాయి కుటుంబ సభ్యులను గ్రామస్తులు సన్మానించారు. డప్పు వాయిద్యాలతో, బాణాసంచా కాల్చుతూ వారిని ఇంటి వరకు ఘనంగా సాగనంపారు.ఈ కార్యక్రమంలో సన్నపనేని బాపనయ్య, నాగినేని నాగేశ్వరరావు, మేడికొండు రవి, వెంకటేష్, రమేష్, నవీన్, దివాకర్, రాంబాబు, వేలూరు సురేష్, మేడికొండు రామయ్య, మురళి, సురేంద్ర, సుబ్బారెడ్డి,రాజగోపాల్‌రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

కడప జిల్లా రాజంపేట మండలం డీబీఎన్ పల్లి గ్రామంలో వినాయక లడ్డూకు రూ.1.20 లక్షల ధర
కడప జిల్లా రాజంపేట మండలం డీబీఎన్ పల్లి గ్రామంలో వినాయక లడ్డూకు రూ.1.20 లక్షల ధర కడప జిల్లా రాజంపేట మండలం డీబీఎన్ పల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. ఈ వేలం పాటలో నాగినేని వరుణ్ సాయి (సన్నీ) రూ.1,20,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు.వేలం పాటలో భక్తులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లడ్డూను కైవసం చేసుకున్న నాగినేని వరుణ్ సాయి మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.అనంతరం నాగినేని వరుణ్ సాయి కుటుంబ సభ్యులను గ్రామస్తులు సన్మానించారు. డప్పు వాయిద్యాలతో, బాణాసంచా కాల్చుతూ వారిని ఇంటి వరకు ఘనంగా సాగనంపారు.ఈ కార్యక్రమంలో సన్నపనేని బాపనయ్య, నాగినేని నాగేశ్వరరావు, మేడికొండు రవి, వెంకటేష్, రమేష్, నవీన్, దివాకర్, రాంబాబు, వేలూరు సురేష్, మేడికొండు రామయ్య, మురళి, సురేంద్ర, సుబ్బారెడ్డి,రాజగోపాల్‌రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

