రాజంపేటలో తప్పిన పెను ప్రమాదం – డివైడర్ ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు , కడప జిల్లా రాజంపేట బైపాస్ రోడ్డులోని NTR సర్కిల్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.చెన్నై నుంచి కర్నూలుకు వెళ్తున్న CGR ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొని దూసుకెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులందరికీ వేరే బస్సు ఏర్పాటు చేసి వారి వారి గమ్యస్థానాలకు పంపించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజంపేటలో తప్పిన పెను ప్రమాదం – డివైడర్ ను ఢీకొన్న ప్రైవేట్ CGR ట్రావెల్స్ బస్సు