వార్త ముఖ్యాంశాలు
- రాజంపేట: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో రూపొందించిన ‘చెప్పాం...
- చేస్తున్నాం’ ప్రత్యేక పోస్టర్ను నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
- 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
రాజంపేట: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో రూపొందించిన ‘చెప్పాం… చేస్తున్నాం’ ప్రత్యేక పోస్టర్ను నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు.పేదలకు ఇళ్లు, తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనలోనూ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.