పేదవాడి కంటి వెలుగు కోసం జనతా ట్రస్ట్ చేస్తున్న సేవకు నిదర్శనం మరోసారి రుజువైంది చెన్నరావుపేట మండల ప్రజల కోసం జనతా ట్రస్ట్ఆధ్వర్యంలో శంకర ఐ ఫౌండేషన్ ఇండియా, శ్రీ కాంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన భారీ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అయ్యింది. ఈ శిబిరంలో 600 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వైద్యుల సూచన మేరకు 54 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వెంటనే వారిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి, అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి కంటి చూపు పొంది, ఆరోగ్యంగా ఈరోజు చెన్నరావుపేట కి తిరిగి వచ్చిన 54 మంది లబ్ధిదారులు. గత కొన్ని సంవత్సరాలుగా దృష్టి లోపంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకోలేక ఇంటికే పరిమితమైన 54 మంది బాధితులు ఈ రోజు కంటి వెలుగు పొందిన లబ్ధిదారుల ఆనందం మాటల్లో చెప్పలేనిది! జనతా ట్రస్ట్ వల్లే మాకు మళ్ళీ చూపు వచ్చింది. జనతా ట్రస్ట్ చైర్మన్ డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటూ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.

54 మంది జీవితాల్లో వెలుగులు నింపిన జనతా ట్రస్ట్ – విజయవంతంగా ఉచిత కంటి ఆపరేషన్లు -ప్రజల ఆరోగ్యమే మా బాధ్యత- జనతా ట్రస్ట్