నాగోల్: నాగోల్ డివిజన్లోని ఆనంద్ నగర్ చౌరస్తాలో డీఎంఆర్ ఆర్కేడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గాయత్రి ఫ్యాషన్ జ్యువలరీ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. షోరూమ్‌ను వెంకటమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ గాయత్రి ఫ్యాషన్ జ్యువలరీ యజమానులు జీడిమెట్ల లక్ష్మణ్, హేమలత మాట్లాడుతూ.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన డిజైన్లలో ఫ్యాషన్ జ్యువలరీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ముఖ్యంగా 1 గ్రాము గోల్డ్ జ్యువలరీలో వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన, ఆకర్షణీయమైన ఆభరణాలను అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.



