Friday, 18 September 2026
  • Home  
  • హనుమాన్ నగర్ ఫేస్–2 లో అన్న ప్రసాద వితరణ ముఖ్య అతిథులుగా అధీరథ మహారథులు
- BHUPALPALLE

హనుమాన్ నగర్ ఫేస్–2 లో అన్న ప్రసాద వితరణ ముఖ్య అతిథులుగా అధీరథ మహారథులు

భూపాలపల్లి: హనుమాన్ నగర్ ఫేస్–2 కాలనీలో వినాయక చవితి ఉత్సవాల భాగంగా సాయి కృష్ణ స్వీట్ హౌస్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి ఏరియా జీఎం గౌరవ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్ర కొమురయ్య మరియు వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు భక్తులకు భోజనాన్ని స్వయంగా వడ్డిస్తూ సేవాభావాన్ని ప్రదర్శించారు.

భూపాలపల్లి: హనుమాన్ నగర్ ఫేస్–2 కాలనీలో వినాయక చవితి ఉత్సవాల భాగంగా సాయి కృష్ణ స్వీట్ హౌస్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి ఏరియా జీఎం గౌరవ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్ర కొమురయ్య మరియు వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు భక్తులకు భోజనాన్ని స్వయంగా వడ్డిస్తూ సేవాభావాన్ని ప్రదర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.