Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHUPALPALLE

భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బుర్ర వినోద్ గౌడ్ నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బుర్ర వినోద్ గౌడ్ నియామకం

వార్త ముఖ్యాంశాలు

  • భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బుర్ర వినోద్ గౌడ్ నియమితులయ్యారు.
  • తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
  • ముఖ్యంగా తన ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బుర్ర వినోద్ గౌడ్ నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బుర్ర వినోద్ గౌడ్ మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. యువత అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల కల్పన వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, యువతకు అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని బుర్ర వినోద్ గౌడ్ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *