Thursday, 17 September 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహన సంస్థ
- ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహన సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహన సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రఖర్ జైన్ చెప్పారు. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.andhra pradesh RainsPhoto : Times Nowఏపీకి వర్షసూచన (ప్రతీకాత్మక చిత్రం)ఇక, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం (సెప్టెంబర్ 19) సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తదుపరి ఇది 3-4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇది దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో వచ్చే వారం కొంత మేరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహన సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రఖర్ జైన్ చెప్పారు. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.andhra pradesh RainsPhoto : Times Nowఏపీకి వర్షసూచన (ప్రతీకాత్మక చిత్రం)ఇక, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం (సెప్టెంబర్ 19) సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తదుపరి ఇది 3-4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇది దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో వచ్చే వారం కొంత మేరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.