దేశం మొత్తానికి ఒకే పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే. దేశంలో కనెక్టివిటీ పెంచారు. వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.. బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘ఎన్డీఏ భాగస్వామ్యాన్ని ఏపీ బలపరుస్తోంది… ఎన్డీఏ ఐక్యతే దేశానికి బలం. ఏపీకి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభిస్తోంది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


