తిరుమలాయపాలేం / ఖమ్మం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరవోలు గ్రామానికి చెందిన పి. సాయి వరుణ్ ముదిరాజ్ నీట్ (NEET) పరీక్షలో ప్రతిభ కనబరిచి, ప్రముఖ కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఆర్థిక ఇబ్బందులు ఆయన వైద్య విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు అండగా నిలిచారు. సాయి వరుణ్ ఉన్నత చదువుల కోసం తక్షణ సహాయంగా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన సాయి వరుణ్‌ను ధర్మారావు అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు వైద్య విద్యలో రాణించడం బీరవోలు గ్రామానికే కాకుండా మొత్తం ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు.
కార్యక్రమం లో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు రుద్ర ప్రదీప్, పాలేరు నియోజకవర్గ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్న రవికుమార్, ఉపేందర్. తదితరులు పాల్గొన్నారు.


