Thursday, 17 September 2026
  • Home  
  • ​మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
- వరంగల్

​మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

వరంగల్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపట్టనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ వరంగల్ జిల్లా కార్యశాల సత్యం కన్వెన్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ప్రోగ్రామ్ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవే ప్రభు సేవ’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ సుదీర్ఘ ప్రజా సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పారిశుధ్య, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ​జిల్లా కన్వీనర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అభియాన్ విజయవంతానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్లు గార్లపాటి మంజుల రెడ్డి, పొనుగోటి వెంకట్ రావు, ఎర్రగొల్ల భరత్ వీర్, చిలువేరు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, జలగం రంజిత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, నాయకులు శ్యాంసుందర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపట్టనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ వరంగల్ జిల్లా కార్యశాల సత్యం కన్వెన్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ప్రోగ్రామ్ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవే ప్రభు సేవ’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ సుదీర్ఘ ప్రజా సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పారిశుధ్య, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
​జిల్లా కన్వీనర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అభియాన్ విజయవంతానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్లు గార్లపాటి మంజుల రెడ్డి, పొనుగోటి వెంకట్ రావు, ఎర్రగొల్ల భరత్ వీర్, చిలువేరు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, జలగం రంజిత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, నాయకులు శ్యాంసుందర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.