Thursday, 17 September 2026
  • Home  
  • సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం: ఎంసీపీఐ(యు) నాయకులు
- వరంగల్

సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం: ఎంసీపీఐ(యు) నాయకులు

నర్సంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా నర్సంపేట అంగడి సెంటర్‌లోని మద్దికాయల ఓంకార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళులర్పించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, షేక్ బందగీలతో పాటు 4 వేల మంది అమరుల త్యాగాల వల్ల 3 వేల గ్రామాలు విముక్తి పొంది, 10 లక్షల ఎకరాల భూపంపిణీ జరిగిందన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా ‘విలీన దినోత్సవం’గా నిర్వహించాలని, రాజధానిలో సాయుధ పోరాట అమరవీరుల భవన నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, డివిజన్ నాయకులు బత్తిని కుమారస్వామి, అనుమాల రమేష్, కర్నే సాంబయ్య, జన్ను రమేష్, నాగేల్లి భాస్కర్, గుణిపాక బిందు తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా నర్సంపేట అంగడి సెంటర్‌లోని మద్దికాయల ఓంకార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళులర్పించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, షేక్ బందగీలతో పాటు 4 వేల మంది అమరుల త్యాగాల వల్ల 3 వేల గ్రామాలు విముక్తి పొంది, 10 లక్షల ఎకరాల భూపంపిణీ జరిగిందన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా ‘విలీన దినోత్సవం’గా నిర్వహించాలని, రాజధానిలో సాయుధ పోరాట అమరవీరుల భవన నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.
​ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, డివిజన్ నాయకులు బత్తిని కుమారస్వామి, అనుమాల రమేష్, కర్నే సాంబయ్య, జన్ను రమేష్, నాగేల్లి భాస్కర్, గుణిపాక బిందు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.