చెన్నారావుపేట, సెప్టెంబర్ 15 : ఎంబిబిఎస్ లో కుసుమ గీతిక సీటు సాధించింది. చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన కుసుమ నరేందర్ – కళ్యాణి దంపతుల కూతురు గీతిక జూలై నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రాసింది. ప్రభుత్వం వెలువరించిన నీట్ ఫలితాలలో 168372 ర్యాంకును సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించింది. గీతిక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంబీబీఎస్ లో సీటు సాధించడంతో తల్లిదండ్రులు నరేందర్- కళ్యాణి, గ్రామస్తులు తదితరులు ఆమెను అభినందించారు.

ఎంబిబిఎస్ లో సీటు సాధించిన గీతిక అభినందించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు.