జూపాడుబంగ్లా: మండ్లెం గ్రామ శివారులోని పొలాల్లో అందర్-బహార్ జూదం ఆడుతున్న స్థావరంపై జూపాడుబంగ్లా ఎస్ఐ K. మల్లికార్జున సిబ్బందితో కలిసి మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.1,25,630 నగదు, 52 పేకముక్కలు, 7 మోటార్ సైకిళ్లు, 8 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుండి మరో ఐదుగురు పరారయ్యారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూద శిబిరంపై దాడి: 8 మంది అరెస్ట్, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం