దుత్తలూరు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 18వ తేదీ శుక్రవారం దుత్తలూరు మండల పార్టీ కార్యాలయంలో పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా ఐడీ కార్డులను పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

దుత్తలూరులో 18న పార్టీ ఐడీ కార్డుల పంపిణీ