పేద కుటుంబానికి అండగా నిలిచిన జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
————————————————————————–
జనగామ, సెప్టెంబర్ 14,పున్నమి జిల్లా ప్రతినిధి :
మానవతా దృక్పథంతో స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు – లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్స్ అందజేసిన మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి.
వినాయక చవితి పర్వదినాన *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మానవతా దృక్పథంతో స్పందించి, ఓ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అండగా నిలిచారు.
పేద, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా ప్రత్యేక చొరవ చూపుతున్న *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతకు మరో ఉదాహరణగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమం నిలిచింది.
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన *మామిడ్ల పద్మ* ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ *జిల్లా కలెక్టర్* సోమవారం, ఉత్తర్వులు జారీ చేశారు.
లబ్ధిదారురాలు గతంలో ఇల్లు మంజూరైందనే నమ్మకంతో అప్పు చేసి తన సొంత స్థలంలో ఇంటి బేస్మెంట్ నిర్మించుకున్నారు. అయితే అవసరమైన ప్రక్రియలో సాంకేతిక సమస్యల కారణంగా నిర్మాణ దశ పోర్టల్‌లో నమోదు కాలేదు. *జిల్లా కలెక్టర్* ఈ విషయాన్ని పరిశీలించి, లబ్ధిదారురాలి అర్హతలను ధృవీకరించిన అనంతరం ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదేశాల మేరకు, జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు లబ్ధిదారురాలి ఇంటికి స్వయంగా వెళ్లి, ప్రొసీడింగ్స్‌ను *మామిడ్ల పద్మ* కు అందజేశారు.
ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణ దశల వారీగా లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతాలో జమ కానుంది.
అలాగే, మున్సిపల్ కమిషనర్ ఇంటి నిర్మాణానికి అవసరమైన బిల్డింగ్ పర్మిషన్ను వెంటనే జారీ చేయడంతో పాటు, వార్డు స్థాయి సిబ్బంది లబ్ధిదారురాలికి అవసరమైన ప్రక్రియలో సహకరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ సెక్షన్ ఇన్చార్జి జెస్సికా, కౌన్సిలర్ అనూష కృష్ణ పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాంగం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది.



