*దొరవారిసత్రం (తిరుపతి జిల్లా):*
దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో రెండు చోట్ల వినాయక విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించడం జరిగింది.
గ్రామ యువకులు, పెద్దలు కలిసి గణనాథుడిని కొలుస్తూ, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
*భక్తుల నుండి భారీ పూలమాలల సమర్పణ:*
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దాతలు వినాయక స్వామికి భారీ పూలమాలలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
– ఒక వినాయక విగ్రహానికి *రూ. 6000/- విలువ చేసే భారీ పూలమాలను*
– మరో వినాయక విగ్రహానికి *రూ. 2016/- సమర్పించడం జరిగింది.
ఈ పూలమాలలను *శివారెడ్డి గారు* తమ సొంత ఖర్చులతో అందించి, స్వామి వారికి అలంకరించారు,మరియు *శ్రీనా రెడ్డీ* గారు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, విగ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
*ఇట్లు,*
*వినాయక ఉత్సవ కమిటీ,*
*కుప్పారెడ్డిపాలెం గ్రామం, దొరవారిసత్రం మండలం.*


