Monday, 14 September 2026
  • Home  
  • జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పసుపుల రాజశేఖర్
- అన్నమయ్య

జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పసుపుల రాజశేఖర్

చిట్వేలు: తిరుపతి జిల్లా చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, ఎన్‌సీసీ అధికారిగా సేవలందిస్తున్న పసుపుల రాజశేఖర్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని రెడ్డి కళ్యాణ మండపంలో ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.వి. రావు ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు–2026 కార్యక్రమంలో ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు.ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులైన ఎన్‌బీకేఆర్ ఐఎస్‌టీ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రముఖ కవి, రచయిత చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి, సత్తివేడు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులం ప్రిన్సిపాల్ నారాయణస్వామి చేతుల మీదుగా పసుపుల రాజశేఖర్‌కు ప్రశంసాపత్రం, షీల్డ్, గోల్డ్ మెడల్ అందజేసి ఘనంగా సత్కరించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలోనూ, ఎన్‌సీసీ ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడంలోనూ రాజశేఖర్ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారం తన వృత్తిపట్ల మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో విద్యార్థుల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.రాజశేఖర్‌కు జాతీయస్థాయి అవార్డు లభించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.