పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది వెంకంపేటలో పాత విభేదాలు మరోసారి బయటపడటంతో యువకులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో తండ్రి కొడుకుతోపాటు నలుగురికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు



