భైంసా: సెప్టెంబర్. 12 పున్నమి ప్రతినిధి. మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంట్రాక్టర్లు దీక్షను కొనసాగిస్తున్నారు.
తమకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు, ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లుల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
Uploaded Video:


