డుంబ్రిగుడ మండలం, కురిడి పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గోరాపూర్, పిట్టమర్రిగూడ, బిల్లాపుట్టు, గొడ్డిగూడ గ్రామాల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు.
టీడీపీ అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర కండువాలు వేసి ఆహ్వానించారు. చంద్రబాబు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి చూసి చేరామని వారు తెలిపారు. ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని దొన్ను దొర భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.


