పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
యలమంచిలి/అచ్చుతాపురం/బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై, చేసిన ఒప్పందాలను ఆమోదించాలని కోరుతూ సెప్టెంబర్ 11న జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని డిమాండ్లు పరిష్కారానికై తమ వంతు కృషి చేస్తుందని సిఐటియు తెలియజేశారు. అనకాపల్లిలో ఉన్న అన్ని బ్యాంకులలో ఈరోజు ఉదయం నుంచి ఉద్యోగులకు సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని పంపిణీ చేసి తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన పిలుపు లో భాగంగా యూనియన్స్తో వారంలో ఐదు రోజులు బ్యాంకింగ్ కోసం జరిగిన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా తొక్కు పెట్టిందన్నారు. కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం బ్యాంకులవారీగా సాధించిన ఫలితాలను బట్టి ఆ బ్యాంకుల్లో కింది నుంచి పైదాకా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మోడీ ప్రభుత్వం మరిన్ని బ్యాంకులను విలీనం చేసి ప్రైవేటీకరణ చర్యలతో పాటు, కార్పొరేట్ అధినేతలు బ్యాంకులకు బకాయిలను ఎగ్గొట్టటం కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పుకొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ విధానాల పట్ల బ్యాంకు ఉద్యోగులు ఇతర కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి తిప్పుకొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని అన్నారు దీంట్లో భాగంగా సెప్టెంబర్ 11 జరిగే సమ్మెలో సిఐటియు ప్రత్యక్షంగా పాల్గొని డిమాండ్లు పరిష్కారాన్ని కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అచ్చుతాపురం మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు బ్యాంకు ఉద్యోగులు గోవిందు, జగదీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


