Thursday, 10 September 2026
  • Home  
  • *భూ సమస్య పరిష్కారం కోసం* *తహసీల్దార్‌కు వినతి,* *kకొత్త పోస్ట్ ఫారంపాలెం గ్రామస్తుకొత్త పోస్ట్ ఫారంలు,* *భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి* *కుమ్మరిపాలెం గ్రామస్తుల వినతి.. ఈ* *నెల 17న గ్రామానికి వచ్చి సమస్యను పరిశీలిస్తామని తహసీల్దార్ రామయ్య హామీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 10 చిట్టమూరు మండలం,*
- తిరుపతి

*భూ సమస్య పరిష్కారం కోసం* *తహసీల్దార్‌కు వినతి,* *kకొత్త పోస్ట్ ఫారంపాలెం గ్రామస్తుకొత్త పోస్ట్ ఫారంలు,* *భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి* *కుమ్మరిపాలెం గ్రామస్తుల వినతి.. ఈ* *నెల 17న గ్రామానికి వచ్చి సమస్యను పరిశీలిస్తామని తహసీల్దార్ రామయ్య హామీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 10 చిట్టమూరు మండలం,*

*భూ సమస్య పరిష్కారం కోసం* *తహసీల్దార్‌కు వినతి,* *kకొత్త పోస్ట్ ఫారంపాలెం గ్రామస్తుకొత్త పోస్ట్ ఫారంలు,* *భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి* *కుమ్మరిపాలెం గ్రామస్తుల వినతి.. ఈ* *నెల 17న గ్రామానికి వచ్చి సమస్యను పరిశీలిస్తామని తహసీల్దార్ రామయ్య హామీ,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 10 చిట్టమూరు మండలం,* చిట్టమూరు : మండల పరిధిలోని కుమ్మరిపాలెం గ్రామంలో కొంతకాలంగా కొనసాగుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ గ్రామస్తులు తహసీల్దార్ రామయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. భూమికి సంబంధించిన వివాదాన్ని గ్రామస్తుల సమక్షంలో పరిశీలించి, న్యాయబద్ధంగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో సుమారు 30 కుటుంబాలకు సంబంధించిన భూ సమస్య కొనసాగుతోంది. ఆ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన ముగ్గురు, బీసీ వర్గానికి చెందిన ఒకరికి భూములకు సంబంధించి పట్టాలు మంజూరైనట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులు వారికి పాస్‌పుస్తకాలు కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు కొంతకాలం ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగించినట్లు వివరించారు. అయితే అనంతరం గ్రామంలోని కొంతమంది ప్రజలు ఆ భూములను అందరికీ సమానంగా పంచాలని కోరడంతో వివాదం తలెత్తినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 1996 సంవత్సరంలో అప్పటి తహసీల్దార్‌ను కలిసి అర్జీ సమర్పించి న్యాయం చేయాలని కోరినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సమస్యపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివాదం న్యాయస్థానం వరకు వెళ్లిందని తెలిపారు. కొంతకాలం కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయని, అనంతరం సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో భూముల పంపిణీ జరిగినట్లు గ్రామస్తులు వివరించారు. అయితే ప్రస్తుతం భూమికి సంబంధించిన వారసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుకుంటున్నారని, దీంతో సమస్య మళ్లీ ఉత్పన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోనే సమస్య పరిష్కరించాలి భూ సమస్య కారణంగా గ్రామంలో వివాదాలు మరింత పెరగకుండా అధికారులు జోక్యం చేసుకుని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని గ్రామస్తులు కోరారు. రెవెన్యూ రికార్డులు, పట్టాలు, పాస్‌పుస్తకాలు, గతంలో జరిగిన భూ పంపిణీ వివరాలను పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. గ్రామస్తులు అందజేసిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రామయ్య పరిశీలించి, సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 17వ తేదీన తాను గ్రామానికి వచ్చి, గ్రామస్తులు మరియు సంబంధిత వ్యక్తుల సమక్షంలో భూ సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు. అధికారులు గ్రామానికి వచ్చిన సమయంలో సంబంధిత రికార్డులను పరిశీలించి, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

*భూ సమస్య పరిష్కారం కోసం* *తహసీల్దార్‌కు వినతి,*
*kకొత్త పోస్ట్ ఫారంపాలెం గ్రామస్తుకొత్త పోస్ట్ ఫారంలు,*

*భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి*

*కుమ్మరిపాలెం గ్రామస్తుల వినతి.. ఈ*

*నెల 17న గ్రామానికి వచ్చి సమస్యను పరిశీలిస్తామని తహసీల్దార్ రామయ్య హామీ,*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 10 చిట్టమూరు మండలం,*

చిట్టమూరు : మండల పరిధిలోని కుమ్మరిపాలెం గ్రామంలో కొంతకాలంగా కొనసాగుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ గ్రామస్తులు తహసీల్దార్ రామయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
భూమికి సంబంధించిన వివాదాన్ని గ్రామస్తుల సమక్షంలో పరిశీలించి, న్యాయబద్ధంగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో సుమారు 30 కుటుంబాలకు సంబంధించిన భూ సమస్య కొనసాగుతోంది.
ఆ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన ముగ్గురు, బీసీ వర్గానికి చెందిన ఒకరికి భూములకు సంబంధించి పట్టాలు మంజూరైనట్లు గ్రామస్తులు తెలిపారు.
అనంతరం రెవెన్యూ అధికారులు వారికి పాస్‌పుస్తకాలు కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
సంబంధిత వ్యక్తులు కొంతకాలం ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగించినట్లు వివరించారు.
అయితే అనంతరం గ్రామంలోని కొంతమంది ప్రజలు ఆ భూములను అందరికీ సమానంగా పంచాలని కోరడంతో వివాదం తలెత్తినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో 1996 సంవత్సరంలో అప్పటి తహసీల్దార్‌ను కలిసి అర్జీ సమర్పించి న్యాయం చేయాలని కోరినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
సమస్యపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివాదం న్యాయస్థానం వరకు వెళ్లిందని తెలిపారు.
కొంతకాలం కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయని, అనంతరం సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో భూముల పంపిణీ జరిగినట్లు గ్రామస్తులు వివరించారు.
అయితే ప్రస్తుతం భూమికి సంబంధించిన వారసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుకుంటున్నారని, దీంతో సమస్య మళ్లీ ఉత్పన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలోనే సమస్య పరిష్కరించాలి
భూ సమస్య కారణంగా గ్రామంలో వివాదాలు మరింత పెరగకుండా అధికారులు జోక్యం చేసుకుని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని గ్రామస్తులు కోరారు.
రెవెన్యూ రికార్డులు, పట్టాలు, పాస్‌పుస్తకాలు, గతంలో జరిగిన భూ పంపిణీ వివరాలను పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు.
గ్రామస్తులు అందజేసిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రామయ్య పరిశీలించి, సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ నెల 17వ తేదీన తాను గ్రామానికి వచ్చి, గ్రామస్తులు మరియు సంబంధిత వ్యక్తుల సమక్షంలో భూ సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు.
అధికారులు గ్రామానికి వచ్చిన సమయంలో సంబంధిత రికార్డులను పరిశీలించి, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.