అనంతసాగరం సెప్టెంబర్ 09,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు బుధవారం తొమ్మిదవ జాతీయ పోషణ మాసం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి అనంతసాగరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కె శర్మిష్ట మాట్లాడుతూ 2026 పోషక మాస కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం,తగిన ప్రోటీన్ గల ఆహారం, అంగన్వాడీ కేంద్రాల్లో తాజాగా వండిన భోజనం, సమాజ భాగస్వామ్యం మరియు బాలల ప్రారంభ అభివృద్ధి, మాతృ ఆరోగ్యం,పిఎంఎం వివై అవగాహన వంటి అంశాల పైన ప్రధాన దృష్టి సారించామని అన్నారు. “హమారా అంగన్వాడి హమారీ జిందగీ “అనే సందేశంతో ప్రాజెక్టులోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాస కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.పోషకాహారాల ప్రదర్శనలు,పోషకాహార మేళాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


