ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి సెప్టెంబర్ 10న నెల్లూరులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు నెల్లూరు ఆర్ఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం నిర్వహించనున్నారు. రాజంపేట ఎంపీ, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణుల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించనున్నట్లు మేకపాటి కార్యాలయం తెలిపింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం