ఖమ్మం నగరంలోని 54 వ డివిజన్ లోని 148, 151, 152, 155, 173 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో సంబంధిత అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని సేకరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లెల నాగారాజు, పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఓటరు సహకరించాలని వారు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని ఈ సందర్భంగా సూచించారు.



