చేనేత కార్మికులకు కొత్త పింఛన్ల మంజూరులో ప్రభుత్వం విధించిన ఆచరణ సాధ్యం కాని నిబంధనలను వెంటనే తొలగించాలని వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం నేతలు డిమాండ్ చేశారు. మాస్టర్ వీవర్ల నుంచి వేతనం బ్యాంకు ఖాతాలో జమైన ఆధారాలు, నూలు కొనుగోలుకు జీఎస్టీ బిల్లులు సమర్పించాలన్న షరతులు పేద నేతన్నలకు భారంగా మారాయని పేర్కొన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా నిబంధనలు సరళతరం చేయాలని కోరారు. రెండో విడత ‘నేతన్న సేవ’ నిధులు విడుదల చేయడంతో పాటు పెండింగ్‌లోని ₹50 వేల ఆర్థిక సాయాన్ని కూడా చెల్లించాలని రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి కోనం బ్రహ్మయ్య, సర్వేపల్లి అధ్యక్షుడు పముజుల శంకరయ్య, కార్యదర్శి బత్తూరి మురళి డిమాండ్ చేశారు.

చేనేత పింఛన్ల కఠిన నిబంధనలు తొలగించాలి