రామచంద్రపురం సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి
రాష్ట్రీయ సేవా సమితి (రాస్) ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్. వెంకటరత్నం సూచనల మేరకు రామచంద్రపురం మండల గంగిరెడ్డిపల్లి పంచాయతీ ఆఫీసు నందు ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన టాటా ట్రస్ట్ క్యాంపు కో ఆర్డినేటర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ మహిళల కోసం రాస్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. క్యాన్సర్ బారిన పడ్డారన్న సంగతి తెలియగానే చాలామంది గుండె నిబ్బరాన్ని కోల్పోతారు. క్యాన్సర్ కంటే వారిని భయమే మానసికంగా కుంగదీసి చంపేస్తుంది. క్యాన్సర్ వ్యాధి సోకినవారికి జీవితం మీద ఆశలు కల్పించే విధంగా వారిలో మనోధైర్యాన్ని నింపే విధంగా రాస్ కృషి చేస్తుంది తెలిపారు. 50% మందుల వల్ల నయం అవుతాయి మరో 50% సంకల్పబలం వల్లే సాధ్యమవుతుంది.
అనంతరం డాక్టర్ వెంకయ్య బాబు మాట్లాడుతూ
క్యాన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకుంటున్నది. ధూమపానం, మద్యపానం, పురుగుల మందులు అవశేషాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వంటివి క్యాన్సర్ కు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో చిన్నారులు మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ ప్రాణాలను హరించే ప్రాణాంతకర వ్యాదే కానీ ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈ మహమ్మారిని జయించవచ్చు అని తెలిపారు.
అనంతరం 100 మందికి బిపి, షుగర్, హెపటైటిస్ మరియు క్యాన్సర్ పరీక్షలు చేయించడం జరిగింది
ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ ఆసుపత్రి సిబ్బందితోపాటు గిరిప్రసాద్ ,మంజునాద్ ,ఉమా మహేశ్వర,సుజిత.క్లస్టర్ లీడర్లు శశికళ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.


