రామచంద్రాపురం సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి
మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 విచారణ ప్రక్రియ 93% పూర్తయిందని మండల సహాయ ఎన్నికల అధికారి యు మధుసూదన్ రావు తెలిపారు. మంగళవారం ఏఈఆర్ఓ పులిరాం సింగ్ సికె పల్లి, అనుపల్లి పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓ ల ద్వారా నోటీసులు అందుకున్న ఓటర్లు ఒరిజినల్ ధృవపత్రాలతో విచారణకు హాజరైనట్లు తెలిపారు. మండలంలోని 33 పోలింగ్ కేంద్రాలలో 4225 మంది ఓటర్లకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశామన్నారు. 3929 ఓటర్లకు విచారణ పూర్తి చేసామని మిగిలిన 7 శాతం 295 ఓటర్ల విచారణ చేయాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో విచారణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కాని ఓటర్లు తప్పకుండా రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలన్నారు. ఈ విచారణ కార్యక్రమంలో సూపర్వైజర్ తరుణ్, బిఎల్వోలు సాహిజా, బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.


