పున్నమి ప్రతినిధి
ముధోల్ , సెప్టెంబర్ 8: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు ఎం.ఏ. లతీఫ్ , మాజీ ఎమ్మెల్యే, ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బోస్లే నారాయణరావు పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తనకు మద్దతు ఇవ్వాలని, తన పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి సిఫారసు చేయాలని కోరుతూ ఎం.ఏ. లతీఫ్ బోస్లే నారాయణరావు పాటిల్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బోస్లే నారాయణరావు పాటిల్ మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకుడికి తాను అండగా ఉంటానని తెలిపారు. ఎం.ఏ. లతీఫ్ గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని, ఆయన పేరును పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఎం.ఏ. లతీఫ్ , బోస్లే నారాయణరావు పాటిల్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శంకర్ చంద్రే , నారాయణరెడ్డి , ప్రకాష్ , అబ్దుల్ వాజిద్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



