మాగనూర్, కృష్ణ మండలాల్లో ఎంపీ డీకే అరుణమ్మ రేపు పర్యటించనున్నట్లు మండల బీజేపీ అధ్యక్షులు జయానంద్ రెడ్డి, నల్లె నర్సప్ప తెలిపారు. మాగనూర్ మండలం నేరడ్గం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు కృష్ణ మండల కేంద్రంలోని కృష్ణ నది ఒడ్డున దత్తాత్రేయ స్వామి దేవాలయం సమీపంలో భవిష్యత్ కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కర్మకాండలు నిర్వహించేందుకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ చేయనున్నారు.
ఈ కార్యక్రమాలకు ఉమ్మడి మండలంలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.



