Tuesday, 8 September 2026
  • Home  
  • కట్ట పుట్టాలమ్మ జాతరలో దండి నరేంద్ర ప్రత్యేక పూజలు
- తిరుపతి

కట్ట పుట్టాలమ్మ జాతరలో దండి నరేంద్ర ప్రత్యేక పూజలు

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 08, (పున్నమి న్యూస్): రేణిగుంట మండలంలోని స్థానిక కరకంబాడి జనసేన నాయకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు కట్ట పుట్టాలమ్మ అమ్మవారి ఆలయాన్ని జనసేన నాయకులు దండి నరేంద్ర సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రైతులు, సామాన్య ప్రజలు, పక్షులు, జంతువులు మరియు సమస్త పర్యావరణం క్షేమంగా ఉండాలని, అందరిపై అమ్మవారి ఆశీస్సులు నిలవాలని ఈ సందర్భంగా దండి నరేంద్ర ప్రత్యేకంగా ప్రార్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో చేసిన జాతర ఏర్పాట్లు, భక్తులకు కల్పించిన వసతులు, స్వాగతం పలుకుతున్న తీరుతో పాటు అద్భుతమైన పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కమిటీని, జనసేన శ్రేణులను అభినందించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఈ ఉత్సవ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు, రేణిగుంట టౌన్ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి, మాజీ వార్డు సభ్యుడు భాషా, ఐటీ కోఆర్డినేటర్ దీనదయాల్, నియోజకవర్గ నాయకులు శ్రీనివాసమూర్తి, త్యాగరాజు, సతీష్, మురగ, తిలక్, వెంకటేష్, సలీం, మునికృష్ణ, లోకేష్, చంద్ర, మధు, నవీన్, సుబ్బు, దివాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.