ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం వెదురుపట్టు రోడ్డు వద్ద హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, టిప్పర్ పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం ధాటికి వాహనాలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ స్పాట్ డెడ్