భద్రతలో భాగంగా చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ట్రాక్టర్ ట్రాలీలపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాలీల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ (రేడియం) స్టిక్కర్లు లేకుండా రహదారులపై తిరుగుతున్న ఐదు ట్రాక్టర్ ట్రాలీలను గుర్తించి సీజ్ చేశారు.
చిట్వేల్ ఎస్‌ఐ ఎస్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకుండా ట్రాక్టర్ ట్రాలీలు ప్రయాణించడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనదారులకు ట్రాలీలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్‌ఐ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ట్రాక్టర్ ట్రాలీ వెనుక భాగంలో తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని వాహన యజమానులు, డ్రైవర్లకు సూచించారు.రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు అవసరమైన రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, లైట్లు, ఇతర భద్రతా పరికరాలను సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ఇకపై కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేని 5 ట్రాక్టర్ ట్రాలీలు సీజ్
భద్రతలో భాగంగా చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ట్రాక్టర్ ట్రాలీలపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాలీల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ (రేడియం) స్టిక్కర్లు లేకుండా రహదారులపై తిరుగుతున్న ఐదు ట్రాక్టర్ ట్రాలీలను గుర్తించి సీజ్ చేశారు. చిట్వేల్ ఎస్‌ఐ ఎస్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకుండా ట్రాక్టర్ ట్రాలీలు ప్రయాణించడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనదారులకు ట్రాలీలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్‌ఐ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ట్రాక్టర్ ట్రాలీ వెనుక భాగంలో తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని వాహన యజమానులు, డ్రైవర్లకు సూచించారు.రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు అవసరమైన రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, లైట్లు, ఇతర భద్రతా పరికరాలను సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ఇకపై కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

